డిసెంబరు 17 నుండి 27 వరకు జరగనున్న 24వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ వేదికపై నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజాలో జరిగే కార్యక్రమాల వివరాలు:
ఆహ్వాన పత్రం — ఆహ్వాన పత్రం – వెనకవైపు
డిసెంబర్ 17వ తేదీ:
ప్రారంభోత్సవ కార్యక్రమం: సాయంత్రం 5.00 గంటలకు
ప్రారంభకులు: శ్రీ దుద్దిళ్ళ శ్రీధర్ బాబు గారు, గౌరవ ఉన్నత విద్యాశాఖ మరియు ప్రవాస భారతీయుల వ్యవహారాల శాఖామాత్యులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం .
ముఖ్య అతిధి: శ్రీ డి. మాణిక్య వరప్రసాదరావు గారు, గౌరవ మాధ్యమిక విద్యాశాఖామాత్యులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం .
గౌరవ అతిధులు:
- శ్రీ వి. రవి ప్రకాష్ గారు, సి.ఇ.ఓ, టి.వి.9.
- శ్రీ కె. ప్రభాకర రెడ్డి గారు, ఐ.ఎ.ఎస్, (రిటైర్డ్)
సభాధ్యక్షులు: ఎస్. శ్రీనివాసరావు గారు, అధ్యక్షులు- హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ.
డిసెంబర్ 18వ తేదీ:
సాయంత్రం 5 గంటలకు: అన్వేషి సంస్థ ప్రచురించిన 7 పుస్తకాల ఆవిష్కరణ సభ
డిసెంబర్ 19వ తేదీ:
సాయంత్రం 5 గంటలకు: “పుస్తకాల కోసం పాదయాత్ర”
పాదయాత్ర ప్రారంభకులు: శ్రీమతి. దగ్గుబాటి పురంధరేశ్వరి గారు గౌరవ కేంద్ర మానవ వనరుల శాఖ సహాయ మంత్రివర్యులు, భారత ప్రభుత్వం. ఈ కార్యక్రమంలో కవులు, కళాకారులు, జర్నలిస్టులు, రచయితలు, ఆర్టిస్టులు, తదితరులు పాల్గొననున్నారు.
డిసెంబర్ 20వ తేదీ:
సాయంత్రం 5 గంటలకు: 2009 అత్యుత్తమ పుస్తకాల ప్రదర్శన (బుక్ షో)
డిసెంబర్ 21వ తేదీ:
సాయంత్రం 5 గంటలకు: సైన్స్ యూనివర్స్ వారు ప్రచురించిన పుస్తకాల ఆవిష్కరణ
డిసెంబర్ 22వ తేదీ:
సాయంత్రం 5 గంటలకు:
డిసెంబర్ 23వ తేదీ:
సాయంత్రం 5 గంటలకు: శ్రీ కె. నాగేశ్వర్ గారు, గౌరవ శాసన మండలి సభ్యుల వారితో “ముంచుకొస్తున్న పర్యావరణం- ముప్పు” అనే అంశంపై చర్చా గోష్టి
డిసెంబర్ 24వ తేదీ:
సాయంత్రం 5 గంటలకు: సరోజరాయ్ కమ్యూనికేషన్స్ పబ్లిషర్ ప్రచురించిన పుస్తకాల ఆవిష్కరణ
డిసెంబర్ 25వ తేదీ:
సాయంత్రం 5 గంటలకు: ప్రముఖ విద్యావేత్త శ్రీ. చుక్కా రామయ్య గారు, గౌరవ శాసన మండలి సభ్యులు- వారితో నేటి తరానికి సామాజిక విద్య అవసరం అనే అంశంపై చర్చా గోష్టి
తదనంతరం మహాకవి శ్రీ.శ్రీ, కొడవగంటి కుటుంబరావుగారి శతజయంతి సభ
డిసెంబర్ 26వ తేది:
సాయంత్రం 5 గంటలకు: “పిల్లలు వారి చదువులు, అలవాట్లు” అనే అంశంపై శ్రీ. బి.వి.పట్టాభిరామ్ గారి టాక్ షో
“పాఠం చెప్పటం ఒక కళ“, పుస్తకావిష్కరణ సభ.
ముఖ్య అతిధి: శ్రీ. బి. ప్రసాదరావు గారు, హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్.
బుక్ ఫెయిర్ వేదికగా పిల్లలకు నిర్వహించిన వివిధ రకాల పోటీల విజేతలకు బహుమతుల ప్రదాన కార్యక్రమం.
డిసెంబర్ 27వ తేదీ:
సాయంత్రం 5 గంటలకు: హైదరాబాద్ బుక్ ఫెయిర్ ముగింపు సభ
ఉత్తమ స్టాల్స్ బహుమతుల పధానము, సాహిత్య కారుల అభినందన కార్యక్రమము.
పై కార్యక్రమాలతో పాటుగా నగరంలోని 500 స్కూల్స్ నుండి వచ్చిన విద్యార్ధినీ, విద్యార్ధులకు వ్యాస రచన, వక్తృత్వం, పెయింటింగ్, పాటలు, కవితలు, అచ్చతెలుగులో మాట్లాడటం, నీకు నచ్చిన పుస్తకం, బుక్ హాంట్, లాంటి పోటీలు బుక్ ఫెయిర్ వేదికగా నిర్వహిస్తున్నాము. ఈ పోటీలన్నిటికి అన్ని స్కూళ్ల నుండి తమ విద్యార్ధులను పంపవలసిందిగా స్కూళ్ళ యజమానులకు విన్నపం చేస్తున్నాము.
అభినందనలతో,
యస్. శ్రీనివాసరావు
(అధ్యక్షులు)
0 Responses
Stay in touch with the conversation, subscribe to the RSS feed for comments on this post.