హైదరాబాద్ బుక్ ఫెయిర్ 2024 గౌరవ సలహాదారుల ఎన్నిక
- vinoo Sparkles
- Oct 23, 2024
- 1 min read
Updated: Oct 28, 2024

37వ హైదరాబాద్ బుక్‌ఫెయిర్ గౌరవ సలహాదారులుగా ప్రముఖ సాహితీవేత్త రామచంద్రమూర్తి, ప్రొ. కోదండరాం ను శనివారం బుక్ ఫెయిర్ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. బుక్ ఫెయిర్ జనరల్ బాడీ సమావేశం బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో షోయాబ్ హాల్లో జరిగింది. ఈ సందర్భంగా గౌరవ సలహాదారులను కమిటీ ఎన్నుకుంది. దీంతో పాటు బుక్ ఫెయిర్ కొత్త నిబందనలను కమిటీ ఏకగ్రీవంగా ఆమోదించింది. బుక్‌ఫెయిర్ నిర్వహన డిసెంబర్ చివరి వారాల్లో నిర్వహించాలని కమిటీ నిర్ణయించింది. త్వరలోనే తేదీలను, స్టాళ్ల నిర్వహణనకు అప్లికేషన్ల ప్రకటన ఉంటుంది. అనంతరం రామచంద్రమూర్తిని మర్యాద పూర్వకంగా కమిటీ సభ్యులు సన్మానించారు. ఈ సమావేవంలో బుక్ ఫెయిర్ ప్రెసిడెంట్ కవి యాకూబ్, జనరల్ సెక్రటరీ ఆర్ వాసు, వైస్ ప్రెసిడెంట్ బాల్ రెడ్డి, శోభన్ బాబు, ట్రెజరర్ నారాయణ రెడ్డి, జాయింట్ సెక్రటరీ సూరి బాబు, సురేశ్ బాబు, ఎమెస్కో అధినేత విజయ్ కుమార్, వీక్షణం ఎడిటర్ ఎన్ వేణుగోపాల్ తోపాటు తెలుగు పబ్లిషర్లు పాల్గొన్నారు.
Comments